రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పునరుద్ఘాటించారు. తమిళనాడు గవర్నర్ రవితో సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు వారిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయేనని రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళ ప్రజల నిజాయితీ,. ఆధ్యాత్మికత గవర్నర్ ను ఎంగానో ఆకర్షించాయని రజనీకాంత్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నానని గవర్నర్ తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే… గవర్నర్ తో తాను రాజకీయ అంశాలు కూడా మాట్లాడానని, అయితే.. వాటిని బయటికి వెల్లడించలేనని రజనీకాంత్ స్పష్టం చేశారు.
Governor Ravi and Thiru. Rajinikanth, @rajinikanth had a delightful meeting today at Raj Bhavan, Chennai. pic.twitter.com/zQ3wj8VibS
— RAJ BHAVAN, TAMIL NADU (@rajbhavan_tn) August 8, 2022