దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కవిత రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.