‘ఆర్ఆర్ఆర్’సినిమా తర్వాత రాంచరణ్ మరో సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరు మోసిన శంకర్ డైరెక్షన్ లో చెర్రీ నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అయితే.. ఈ సినిమాలో శంకర్ ముద్ర స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. సోషల్ మెసేజ్ తో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైన్ గా కూడా ఉండబోతోదని టాక్. అయితే.. ఈ సినిమాకు టైటిల్ మాత్రం ఇంకా సెట్ అవ్వలేదట. ఓ రెండు మూడు టైటిల్స్ అనుకున్నా… ఇంకా ఖరారు కాలేదు.
అయితే.. ప్రేక్షకులకు క్యాచీగా వుండే టైటిల్, సోషల్ మెసేజ్ టైటిలే వుండాలని చిత్రం యూనిట్ తెగ తంటాలు పడుతోందట. టైటిల్ విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నారట. అయితే ఈ మధ్యే ఓ టైటిల్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. దానిపేరే సిటిజన్. ఈ వార్త పుకారు కావడంతో అటు చెర్రీ అభిమానులు, నెటిజన్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారట.
గతంలో అధికారి అని పేరు పెట్టాలని అనుకున్నారట. కానీ.. అధికారి కంటే సిటిజనే నయమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చెర్రీ సివిల్ సర్వెంటే కాకుండా రాజకీయ నేతగా కూడా కనిపిస్తారట. జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.