తాజా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ ను వీడారు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రపతి భవన్ లోకి ముర్ము అధికారికంగా నివాసం వుంటున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే కోవింద్ రాష్ట్రపతి భవన్ ను వీడారు. అంతకు పూర్వం కోవింద్ సంప్రదాయకంగా రాష్ట్రపతి భవన్ అంగరక్షకుల నుంచి సంప్రదాయ వీడ్కోలు తీసుకున్నారు. తదనంతరం కోవింద్ తన కటుంబీకులతో కలిసి ప్రభుత్వం కేటాయించిన 12 జనపథ్ నివాసానికి చేరుకున్నారు.
ఇక… కోవింద్ రిటైర్డ్ అయ్యారు కాబట్టి… ఇకపై ఆయనకు 2.5 లక్షల పింఛన్ వస్తుంది. ఇద్దరు ప్రైవేట్ సెక్రెటరీలు, ఒక వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు ప్యూన్లను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక… కోవింద్ కార్యాలయానికి అయ్యే ఖర్చుల కింద ఏడాదికి లక్ష ఇస్తారు. రిటైర్డ్ అయిన రాష్ట్రపతి సతీమణికి ఉచిత వైద్యం, చికిత్సల సౌలభ్యం కూడా వుంటుంది.