Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘రామబాణం’ థర్డ్ సింగిల్ నువ్వే నువ్వే మే 5 న విడుదల

లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘రామబాణం’.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత.

ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్  ట్రెమండస్ రెస్పాన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షలులని ఆకట్టుకుంది. ఐఫోన్, దరువెయ్యరా పాటలు చార్ట్ బస్టర్స్ గా అలరించాయి.

తాజాగా మేకర్స్ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ థర్డ్ సింగిల్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 5 న రామబాణం థర్డ్ సింగిల్ నువ్వే నువ్వే పాటని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో లీడ్ పెయిర్ బ్యూటీఫుల్ అండ్ లవ్లీ గా కనిపించారు.

భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు.

Related Posts

Latest News Updates