స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ చిత్ర కథాంశం. రామా క్రియేషన్స్ అండ్ నాని మూవీ వర్క్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు సుమన్, నిర్మాత, డి.ఎస్ రావు, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్,తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, ఫార్మర్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ కొల్లి రామకృష్ణ, మిసెస్ ఇండియా నేషనల్ & ఇంటర్నేషనల్ సుహాసిని పాండ్యన్ తదితరులు చీఫ్ గెస్ట్ లు గా రావడం జరిగింది. సీనియర్ నటులు సుమన్ స్క్రిప్ట్ అందించారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు క్లాప్ కొట్టగా, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ప్రముఖ దర్శకులు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు.