మాస్ మహారాజ రవితేజ హీరోగా.. తెరకెక్కిన చిత్రం రామరావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. శనివారం రాత్రి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఎప్పటి లాగే మాస్ గా వుండే అభిమానులను మెప్పించేలా రవితేజ యాక్షన్ వుంది. 1995 నాటి యథార్థ ఘటనలతో తెరకెక్కిన చిత్రం ఇది. ఎప్పటి లాగే యాక్టింగ్, డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. ఇక.. నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇక.. చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి కనిపిస్తున్నారు. దీనికి సామ్ సీఎస్ స్వరాలందిస్తున్నారు.