Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘రంగ రంగ వైభవంగా’ టీజర్ రిలీజ్.. ఖుషీ సినిమా తలపిస్తోందంటూ కామెంట్స్

నటుడు వైష్ణవ్ తేజ్… నటి కేతికా శర్మ కలిసి నటించిన లవ్లీ చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ సినిమా టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. పూర్తి ప్రేమ కథా చిత్రం. ఈ సినిమాలో వైష్ణవ్ రిషిగా, కేతిక రాధగా కనిపిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గిరీషయ్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

వచ్చే నెలలోనే ఈ చిత్రం రిలీజ్. అయితే.. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ మాట్లాడుకోరు. కానీ గాఢంగా ప్రేమలో పడతారు. నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. కానీ నీకు నాతో మాట్లాడడానికి ఇగో అని హీరోతో హీరోయిన్ అంటుంది. ఇదే ఈ సినిమా థీమ్. ఈ సినిమాలోని రొమాంటిక్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ టీజర్ ను గుర్తుకు తెస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.

ఫ్రెండ్.. ఏంటే కలిసొచ్చారు.. కలిసిపోయారా?

కేతిక : నువ్వెలా వచ్చావ్..

ఫ్రెండ్ : ఆటోలో

కేతిక : మరి ఆటోవాడు, నువ్వు కలిసిపోయారా? అంటూ సాగిన డైలాగులు భలే వున్నాయి.

Related Posts

Latest News Updates