మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం రావణాసుర. ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మాంచి ఊపుమీదున్న రవితేజ… త్వరలోనే రావణాసుర అనే సినిమాతో మళ్లీ మోత మోగించనున్నాడు. అయితే… ఈ మూవీ టీజర్ రిలీజ్ కి మూవీ యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 6 న ఉదయం 10.08 నిమిషాలకు టీజర్ ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నాడు.
భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 9 న విడుదలకు సిద్ధంగా వుంది. ఇందులో శ్రీరామ్, అను ఇమ్మాన్యుయెల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేశ్, మురళీ శర్మ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక… భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.