మాస్ మహారాజా రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం రావణాసుర. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభమే యాక్షన్ ఫైట్ తో ప్రారంభమైంది. దీనిని బట్టి చూస్తే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని అర్థమైపోతుంది. ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే అనే మాస్ డైలాగ్ ఆడియన్స్ కి మరింత ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీరోల్ లో కనిపించనున్నాడు. మొత్తంగా టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు.