Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని అనుకోనేలేదు : రెబెల్ స్టార్

డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడని అస్సలు ఊహించనే లేదని రెబెల్ స్టార్ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అంటూ తెగ ప్రశంసించారు. ప్రభాస్ తెరకెక్కి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా రెబెల్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 సంవత్సరాలు గడిచాయా? అన్న సందేహం కలుగుతుందని అన్నారు.

గోపికృష్ణ బ్యానర్‌లో ప్రభాస్‌ను హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. నిర్మాత అశోక్‌ కుమార్‌, దర్శకుడు జయంత్‌ వచ్చి ఆ అవకాశం మాకు ఇవ్వండి అని అడిగారు. ఈశ్వర్‌ కథ నచ్చి ఓకే అన్నాం. ఆ చిత్రం చక్కని విజయం అందుకుని తనను హీరోగా నిలబెట్టింది. నిర్మాత అయుండి అశోక్‌కుమార్‌ విలన్‌గా నటించడం గొప్ప విషయం. ప్రభాస్‌ తొలి చిత్రం చూసి గొప్ప హీరో అవుతాడనుకున్నాం. కానీప్యాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగాడని, అతని శ్రమ, పట్టుదలే కారణమని అన్నారు.

ఇక.. దర్శకుడు జయంత్ పరాన్జీ కూడా ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడాడు. తాను పరిచయం చేసిన హీరో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అస్సలు అనుకోలేదని, ప్రభాస్ గొప్ప వ్యక్తి అని ప్రశంసించాడు. తనను ఈ మధ్యే కలిశానని, ఈశ్వర్ సినిమాలో ఎలాగైతే వుండేవారో అదే అభిమానాన్ని చూపించాడని అన్నారు. ప్రముఖ హీరో అన్న గర్వమే తొణికిసలాడలేదని జయంత్ పరాన్జీ అన్నారు.

ప్రభాస్ ను నిలబెట్టిన ఈశ్వర్

హీరోగా పరిచయమై నేటికి 20 ఏళ్లు గడచిన సందర్భంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో సెలెబ్రేషన్స్ జరిగాయి. కొద్ది మంది అభిమానులు, ఈశ్వర్ సినిమా డైరెక్టర్ జయంత్ పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఇక.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు భార్య కూడా ఈశ్వర్ సినిమా నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ సినిమా షూటింగ్ రోజు రామానాయుడు స్టూడియోస్ వెళ్లే రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయని, స్టూడియోకి నడుచుకుంటూ వెళ్లామని చెప్పారు.

Related Posts

Latest News Updates