తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చేందుకు నిజామాబాద్ జిల్లా నుండే మార్పు మొదలు కావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం లింబాద్రి శ్రీ లక్మీ నరసింహుని రేవంత్ దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన నేరమా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగించిన ప్రజలకు పంగనామాలు పెట్టారని, అలాంటి దండుపాళ్యం ముఠాను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కొరకు రైతులు, మేధావులు, యువకులు, మహిళలు ఆలోచన చేయాలని కోరారు. జిల్లాలో పర్యటించి ఇక్కడి ప్రజల సమస్యలు తెలుకోవడంతో పాటు వాటి పరిష్కారం దిశగా ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ మేనిపెస్టో లో చెరుస్తామని వెల్లడించారు.
