తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏలుబడిలో పైలం బిడ్డా బడికి పోతున్నావు అనే దుస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు చదువుకునేందుకు చోటు లేదని, పుస్తకాలు కూడా లేవని, గురువులు అసలే లేరని రేవంత్ ఎద్దేవా చేశారు. పురుగుల అన్నం కూడా విద్యార్థులకు పెడుతున్నారని, మన ఊరు – మన బడి అంటే ఇదేనా? అంటూ రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలోని సర్కారు బడులను సీఎం సర్వనాశనం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
చదువుకునే చోటు లేదు
చదువుకునెందుకు పుస్తకం లేదు
చదువు చెప్పే గురువులు లేరు
పసి పిల్లల ప్రాణాలకు భరోసా లేదుఈ ఉద్యమ ద్రోహి పాలనలో..
పైలం బిడ్డో.. అని బడికి పంపే పరిస్థితి.కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు బడులపై కాంగ్రెస్ నజర్..#UdyamaDrohiKCR pic.twitter.com/QzXLjwQaqH
— Revanth Reddy (@revanth_anumula) August 8, 2022