భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డిపై చేసిన పరుష వ్యాఖ్యలకు రేవంత్ బహిరంగంగా క్షమాపణ కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు గౌరవం ఉందన్నారు. చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడటంతో వారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డిని అవమానించే విధంగా ఎవరూ మాట్లాడిన తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సూచన చేయడం జరుగుతందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
