నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేకవ్ సంఘ్ ఆధ్వర్యంలో నగర శారీరిక్ ప్రదానోత్సవం జరిగింది. భైంసా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు గణ వేషతో పథ సంచలన్ నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు ఫూలేనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్ నుంచి ప్రారంభమైన పథ సంచాలన్ పలు ప్రాంతాల మీదుగా కొనసాగింది. చివరగా ఫూలేనగర్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల శారీరక ప్రదర్శనలు కొనసాగాయి.
పథ సంచలన్ సాగుతున్న మార్గంలో ప్రజలు స్వయం సేవకులపై పూల వర్షం కురిపించి, సంఘ్ పై, కార్యకర్తలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా కాలనీల మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ పథ సంచలన్‌కు తమ వంతు మద్దతు తెలిపారు.భారీ సంఖ్యలో మంది పూర్ణగణవేష ధారి స్వయం సేవకులు ఈ పథ సంచలన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు పలు శారీరక్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఇతిహాస సంకలన సమితి భాగ్యనగర్ సంభాగ్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఇందు శేఖర్ , ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ గాడే మహేశ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ గాడి మహేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. త్వరలోనే లక్ష్యమైనటువంటి పరమ వైభవ స్థితి చేరాలని ఆయన ఆకాక్షించారు.
అనంతరం ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఇతిహాస సంకలన సమితి భాగ్యనగర్ సంబాగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఇందుశేఖర్ గారు మాట్లాడుతూకులం, ప్రాంతం, భాష తదితర విభేదాలన్ని విడిచి సంఘటితమైతేనే హిందూ సమాజం అభివృద్ధి జరుగుతుందన్నారు. హిందువులందరూ ఏకమై ముందుకు సాగితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. దేశంలో చరిత్ర వక్రీకరణ గురైందని, దానినే మనం చదువుతున్నామన్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. వాటిని మనం గుర్తించడంలేదని పాశ్చాత్య సంస్కృతిని గొప్పగా భావించడం దురదుష్టకరమన్నారు. ఇది నాటి బ్రిటిష్ వారి పాలన నుంచి కొనసాగుతుందన్నారు. దాని నుంచి మనం బయటపడాలన్నారు. ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు పర్యావరణ పరిరక్షణ, దేవాలయ పరిరక్షణ, సనాతనమైన సంస్కృతి సాంప్రాదాయాల పరిరక్షణకు అంకితభావంతో కృషిచేస్తున్నారన్నారు. దేశ సమైక్యతతో కోసం ఆర్.ఎస్.ఎస్ నిత్యం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ నిర్మల్ జిల్లా సంఘచాలక్ శ్రీ నూకల విజయ్‌కుమార్, భైంసా నగర సంఘచాలక్ సాదుల కృష్ణదాస్, తదితరులు పాల్గొన్నారు.