కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ క్రికెట్ పరిభాషను ప్రయోగిస్తూ ప్రధాని మోదీ పనితీరు, ప్రభుత్వ పనితీరును వివరించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ థింక్ ట్యాంక్ ఈవెంట్ రైసినా డైలాగ్ లో జైశంకర్ మాట్లాడారు. కెప్టెన్ మోదీ తో ఉదయం 6 గంటలకే నెట్ ప్రాక్టీస్ ప్రారంభం అవుతుంది. అది చాలా సమయం కొనసాగుతుందని వివరించారు. రాణించగల బౌలర్ వుంటే… మా కెప్టెన్ అతడికి బాల్ ఇస్తారని, కొంత స్వేచ్ఛ కూడా ఇస్తారని అన్నారు.
ఇలా అవకాశం ఇవ్వడం ద్వారా వికెట్ పడుతుందన్న అభిప్రాయంలో మోదీ వుంటారని వివరించారు. అయితే.. కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. లాక్ డౌన్ అనే నిర్ణయం చాలా కఠినమైందని, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నిర్ణయం తీసుకోకుంటే ఏం జరిగేదో అని అన్నారు. క్రికెట్ జట్టులాగే తాము స్వదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా మ్యాచ్ గెలవాలని కోరుకుంటామని అన్నారు.