Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘సైతాన్’ వల్గర్ వెబ్ సిరీస్ కాదు.. అందుకే ఆ స్వేచ్ఛ తీసుకున్నా: మహి వి రాఘవ్   

గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి.

దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. నేను ఒక విషయాన్ని వివరించాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. కానీ మేము ముందుగానే ఈ కంటెంట్ విషయంలో హెచ్చరిక చేస్తూనే ఉన్నాం. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని తీవ్రమైన పదాలు, వయలెన్స్ ఉంటాయి.. ఇది క్రైమ్ కథలని ఇష్టపడే ఆ తరహా ఆడియన్స్ కోసం తెరకెక్కించిన వెబ్ సిరీస్. నేను ఈ కథతో క్రైమ్ వరల్డ్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ఒక దర్శకుడిగా క్రైమ్ వరల్డ్ ఎలా ఉంటుందో చూపించేందుకు స్వేచ్చని తీసుకున్నా. ఆరిస్టుల చేత ఆ తరహా పెర్ఫామెన్స్ చేయించా. ఇలా చేయకుంటే ఈ కథకి న్యాయం జరగదు అనిపించింది.

సైతాన్ వల్గర్ చిత్రం కాదు.. కానీ క్రైమ్ వరల్డ్ ని బేస్ చేసుకున్న కథ కాబట్టి కొన్ని ఘాటైన పదాలు ఉంటాయి. పోస్టర్స్, ట్రైలర్ ద్వారా ఇది ఎలాంటి వెబ్ సిరీస్ అనేది క్లియర్ గా చెప్పేశాం. కాబట్టి దీనిని చూడాలా లేదా అనేది ఆడియన్స్ యొక్క వ్యక్తిగతమైన ఛాయిస్.

ఒక రచయిత, కళాకారుడు, క్రియేటివ్ గా తమ ఆలోచనలని స్వేచ్ఛగా ఎలా వ్యక్తం చేస్తారో.. అదే విధంగా ఒక దర్శకుడికి తన కథలో పదాలు, డైలాగ్స్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని భావిస్తా అంటూ మహి వి రాఘవ్ క్లారిటీ ఇచ్చారు. జూన్ 15 నుంచి సైతాన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related Posts

Latest News Updates