ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని వెల్లడించారు. అయితే, వాళ్ల పేర్ల ఇప్పుడే బయటపెట్టలేమని చెప్పారు. సరైన సమయంలో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతోనే ఏడుగురిని బరిలోకి దింపామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాము మొదటి నుంచే లెక్కలోకి తీసుకోలేదని చెప్పారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో గుర్తించామని తెలిపారు. చంద్రబాబు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నారని సజ్జల ఆరోపించారు.
ఏపీలో అధికార వైసీపీకి మళ్లీ ఝలక్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను కోల్పోయిన అధికార వైసీపీకి ఇప్పుడు ఈ పరిణామం మరో షరాఘాతం. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి 23 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె విక్టరీ కొట్టేశారు.
అయితే.. ఎమ్మెల్యే కోటాలోని 7 స్థానాలకు జరిగిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏడు స్థానాలనూ తామే కైవసం చేసుకుంటామని కూడా ప్రకటించింది. అయితే… తమ ఒక్క అభ్యర్థి పంచుమర్తి అనూరాధను తాము కచ్చితంగా గెలిపించుకుంటామని ఇటు టీడీపీ కూడా ప్రకటించింది. దీంతో పోరులో ఉత్కంఠత నెలకొంది. చివరికి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు జోష్ గా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు కొనసాగాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చంద్రబాబు ఇతర నేతలతో కలిసి పెద్ద కేక్ ను కట్ చేశారు. కార్యకర్తలు బయట టపాసులు కాలుస్తూ…. ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ స్థానం గెలవడంపై టీడీపీ నేతలు తెగ ఆనందం వ్యక్తం చేశారు. ఈ యేడాది 2023 టీడీపీదేనని సీనియర్ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు.