ఒకే ఒక్క ఫ్రేమ్… హీరో దిగ్గజాలు ఇమిడిపోయారు. ఇంకేముంది… ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే గా కూడా నిలిచిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేశ్, రామ్ చరణ్, ఉపాసన, పూజా హెగ్గే ఒకే ఫ్రేమ్ లో క్లిక్ మన్నారు. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం కభీ ఈద్.. కభీ దివాళీ అన్న చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరందరూ చెర్రీ ఇంట్లో కలుసుకున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్, రామ్ చరణ్ ఇద్దరూ అతిథి పాత్రలో కనిపిస్తారని ఓ టాక్.
అయితే ఈ ఫొటోను రాం చరణ్ ట్విట్టర్ అకౌంట్ తో పాటు ఉపాసనా కామినేని పెట్ డాగ్ రైమ్ ఇన్ స్టా అకౌంట్లో కూడా పోస్ట్ అయ్యింది. నేను లక్కీ పప్పీని. ప్రేమలు.. కౌగిలింతలు.. అన్నీ దక్కుతున్నాయి నాకు అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటోలో ఉపాసనా కామినేని తన పెంపు కుక్క రైమ్ ను కూడా పట్టుకొని వుంది.