Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సల్మాన్ ఖాన్ హమ్మింగ్ కు సమంత రియాక్షన్ ఇదీ…

సల్మాన్ ఖాన్ ఈ మధ్య హమ్ చేసిన పాట ఏదో తెలుసా? సల్లు భాయ్ ని అత్యంత ప్రభావితం చేసిన పాట ఏదో తెలుసా? మన తెలుగు పాటే. దట్ టూ సమంత యాక్ట్ చేసిన సినిమాలోని పాట. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా అంటూ స్పెషల్ సాంగ్ సమంత చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అత్యంత హిట్ కొట్టిన పాట అది. ఈ హిట్ పాటనే సల్లూ భాయ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో హమ్ చేశాడు. తనను బాగా ఇన్ స్పైర్ చేసే పాట కూడా ఇదే అంటూ హమ్మింగ్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటీవల సల్మాన్ ఖాన్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన సినిమా గానీ, పాట గానీ వుందా? అని యాంకర్ అడిగింది. దీనికి సమాధానంగా సల్మాన్ అత్యంత ఉత్సాహంతో ఊ అంటావా.. మావా అని హమ్ చేశాడు. దీనిని సల్లూ భాయ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ట్వీట్ చేశారు. దీనిని సమంత రీ ట్వీట్ చేస్తూ.. రెడ్ కలర్ లో వునన్ హార్ట్ ఎమోజీస్ తో పంచుకుంది.

Related Posts

Latest News Updates