Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ముచ్చింతల్ లో స‌మ‌తా కుంబ్ ఉత్స‌వాలు

ముచ్చింతల్తో 216 అడుగుల పంచ లోహ రామానుజాచార్యుల విగ్రహంతో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కేంద్రం ఏర్పడి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి ఏడాది కావస్తున్నది. ఈ తరుణంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ ఉ 2023 జరుగనుందని చిన జీయర్ స్వామిజీ వెల్లడించారు.  ముచ్చింతల్ లో చిన జీయర్ స్వామిజీ  మీడియాతో మాట్లాడుతూ శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 108 దివ్య దేశాలు సమతామూర్తి కేంద్రంలో ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారని తెలిపారు.  ఈ ఏడాది 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నామని వెల్లడించారు. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 11వ తేదీన లక్ష మందితో భగవద్గీత పారాయణం ఉంటుందన్నారు. రామానుజాచార్యులు చాలా మేధావి అంతే కాకుండా మనసు ఉన్న మనస్వి. అన్ని వర్గాల వారిని సమాజంలోకి తెచ్చి ఆలయాల్లో భాగస్వాములను చేశారని అన్నారు.

Related Posts

Latest News Updates