యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా పొలిటికల్ యాక్షన్ చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఆగస్ట్ 12 న ప్రేక్షకుల ముందుుకు రానుంది. రీసెంట్ గా ఈ సినిమాకు చెందిన ఓ పాట కూడా విడుదలైంది. రా రా రెడ్డి అంటూ ప్రేక్షకులను తెగ జోరు తెప్పిస్తోంది. అయితే.. ఈ చిత్రంలో విలన్ ఎవరు అనేది ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ చెప్పలేదు. తాజాగా.. ఈ విషయాన్ని కూడా చెప్పేసింది. నితిన్ కు విలన్ గా విలక్షణ నటుడు సముద్ర ఖని. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఈ సముద్ర ఖని ఎన్నికవుతాడు.
మెలితిరిగిన మీసం, నుదుటిన బొట్టు, మెడలో రుద్రాక్ష వేసుకొని.. సీరియస్ గా సముద్ర ఖని సంతకం చేస్తున్న చిన్న బిట్ ను యూనిట్ విడుదల చేసింది. సముద్ర ఖని లుక్ ను చూసి సోషల్ మీడియాలో మంచి స్పందన కూడా వస్తోంది. ఇక.. ఈ చిత్రాన్ని రాజకుమార్ ఆకెళ్ల సమర్నణలో, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై వస్తోంది. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసాహీరోయిన్లుగా, నితిన్ హీరోగా వస్తున్నాడు.
https://twitter.com/SreshthMovies/status/1547445827274125313?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1547445827274125313%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2Ftelugunews%2Fsamuthirakani-as-rajappa-in-macherla-niyojakavargam-kbk-mrgs-chitrajyothy-1822071406033411