ఏపీ పారిశుద్ధ్య కార్మికులు తమ సమ్మెను శుక్రవారం విరమించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నాలుగు రోజులుగా వారు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం చేసిన ప్రకటనతో తాము సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. మరో మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామి కార్మిక నేతలు వెల్లడించారు. నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
సమస్యలపై చర్చించింది. ఓహెచ్ వో ఇచ్చేందుకు 6 వేలు అలానే ఉంచాలన్న డిమాండ్ కు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6 వేల రూపాయలు యథాతథంగా వుంటుంది. .జీతంతో పాటు 6 వేలు OHA కలిపి 21 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజుల్లో కూడా ఆక్యుపేషన్ అలవెన్స్ కొనసాగిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.