తెలంగాణలోని విద్యా సంస్థలు నేటి నుంచి పున: ప్రారంభమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో 3 రోజుల పాటు సెలవులని తెలిపింది. ఆ తర్వాత కూడా వర్షాలు విపరీతంగా వుండటం, పలు ప్రాంతాలు నీట మునగడం లాంటి పరిస్థితులు తలెత్తడంతో మరో 4 రోజుల పాటు సెలవులను పొడగించింది ప్రభుత్వం.
ప్రభుత్వ పొడగింపు ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. అయితే మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు వుంటాయని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. ప్రస్తుతానికైతే పాఠశాలలు యథావిథిగానే ప్రారంభమయ్యాయి. వానలు పెరిగితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనేది తెలియాలి.