కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం ఆగష్టు 21న మహా కుంభాభిషేకంతో భక్తులకు పునఃదర్శన కలుగజేసే కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 4వ తేదీ గురువారంనాడు వేద పండితుల ఆధ్వర్యంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు వివిధ పూజా పునస్కారాలు వైభవంగా నిర్వహించారు. గణేశుని జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా తోపాటు పండితులు, ప్రభుత్వ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తులు విరివిగా పాల్గొన్నారు.
