దుల్కర్ సల్మాన్, మ్రుణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. విడుదలైనప్పటి నుంచే సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విషయంలో చాలా మంది పాజిటివ్ టాక్ వినిపిస్తున్నారు. ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. అయితే.. దీనికి ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థైన అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సుమారు 6 వారాల తర్వాత ఓటీటీలోకి ఈ సినిమా రానుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. క్లాసిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.
