భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీలో అత్యున్నత నిర్ణయాత్మాక మండలిగా చెప్పుకునే పార్లమెంటరీ బోర్డులో ఆయనకు అధిష్టానం చోటు కల్పించింది. తద్వారా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కింది. మొత్తంగా కొత్తగా 6 గురికి చోటు కల్పిస్తూ పార్లమెంటరీ బోర్డులో ప్రక్షాళన చేపట్టింది. కొత్తగా పార్లమెంటరీ బోర్డులో కొత్తగా చోటు పొందినవారిలో బీఎస్.యోడ్యూరప్ప, శర్బానంద్ సోనోవాల్, డా.కే. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, సుధా యాదవ్, సత్యనారాయణ్ జటియా ఉన్నారు.