హీరోయిన్ సమంత జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకుంది. ప్రత్యేక పూజలు కూడా చేసింది. హీరోయిన్ సమంతతో పాటుగా శాకుంతలం సినిమా యూనిట్ కూడా పెద్దమ్మ తల్లిని దర్శించుకుంది. సమంతతో పాటుగా డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమ, దేవ్ మోహన్ కూడా దర్శించుకున్నారు. శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ గుణశేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా పాత్రలు పోషించారు.
