మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం కూలిపొవచ్చని, మధ్యంతర ఎన్నికలు కూడా వస్తాయంటూ బాంబు పేల్చారు. ముంబైలో తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ పవార్ పై విధంగా అంచనా వేశారు.
ప్రస్తుతం శిండే సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఆయనపై ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని, మంత్రిత్వ శాఖలు కేటాయించిన తర్వాత అసలు విషయం బయటపడుతుందన్నారు. అది చివరకు కూలే దశకే చేరుకుంటుందని, అందుకే ఎన్సీపీ నేతలు ప్రజలకు అందుబాటులో వుండాలని శరద్ పవార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోవచ్చు. అందుకే మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా వుండాలి అని పవార్ పిలుపునిచ్చారు.