శివసేనపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఎమ్మెల్యేలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలని వారికి సవాల్ విసిరారు. ఇంకెంత కాలం అస్సాంలో దాక్కుంటారు? తిరిగి రండి అంటూ దెప్పిపొడుస్తూ సవాల్ విసిరారు. నిజమైన శివ సైనికులు సీఎం ఉద్ధవ్ వెంటే ఉంటారని అన్నారు. రెబెల్స్ అంతా ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
శివసేన ఇలా రెబెల్స్ కు సవాళ్లు విసురుతుంటే.. రెబెల్స్ ఎమ్మెల్యేల నాయకుడు ఏకనా్ షిండే తదుపరి వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఏ పార్టీలో చేరాలి? తదుపరి కార్యాచరణపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇక 15 మంది రెబెల్స్ పై శివసేన అనర్హత వేటు వేసింది. దీంతో ఏకనాథ్ షిండే సుప్రీం మెట్లెక్కారు. దీనిపై అటు శివసేన కూడా న్యాయపోరాటానికి సై అంటోంది.