శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే వర్గానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వార్నింగ్ ఇచ్చారు. శివసేన నుంచి వేరు కుంపటి పెట్టుకున్న ఏక్ నాథ్ షిండే వర్గం వేరే పేరు పెట్టుకుంది. ఈ పేరులో శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే పేరు ఉంది. దీనిపై సీఎం ఉద్ధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బాలా సాహెబ్ పేరును మాత్రం వాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆ పేరు తప్ప మిగితా ఏ పేరునైనా పెట్టుకోండని సూచించారు.
శివసేనకు ఝలక్ ఇచ్చిన ఏకనాథ్ షిండే తమ గ్రూప్ పేరును శివసేన బాలా సాహెబ్ అని పేరు పెట్టుకున్నారు. అందుకే సీఎం ఉద్ధవ్ ఫైర్ అవుతున్నారు. వారికి ఇష్టమైన రీతిలో వ్యవహరించవచ్చని, అయితే బాలా సాహెబ్ పేరును మాత్రం వాడొద్దని, తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తాము అత్యంత కఠినంగానే వుంటామని ఉద్ధవ్ పేర్కొన్నారు. వారికి దమ్ముంటే తన తండ్రి పేరుతో ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
అయితే.. బాలా సాహెబ్ పేరును ఎవరూ ఉపయోగించకూడదన్న కీలక తీర్మానాన్ని శివసేన చేసింది. శివసేన పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు ఉద్ధవ్ కే ఉంటుందని ఈ సమావేశం తేల్చి చెప్పింది.
ముంబై నగరంలో 144 సెక్షన్
తిరుగుబాటు చేసిన శివసేన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏకనాథ్ షిండే నివాసం వద్ద భద్రత పెంచారు. మరోవైపు ముంబై నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. వచ్చే నెల 10 వరకూ అమలులో వుంటుందని ప్రకటించారు.