నాటు నాటు పాట ఆస్కార్ కొట్టడంతో ప్రపంచమంతా ఈ పాట ఇప్పుడు మార్మోమోగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాటకు కాళ్లు కదిపిన వారే. అందరూ అలా కళ్లు అప్పగించిన చూసిన వారే. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రావడంతో ఈ పాటకు మరింత క్రేజ్ పెరిగింది. RRR మూవీ టీమ్ ప్రతిష్ఠ మరింత పెరిగింది. అయితే… నాటు నాటు పాటపై కీరవాణి తండ్రి శివశక్తి దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పాట ఆయనకు నచ్చలేదుట. ఈ పాటలో అసలు సంగీతమెక్కడ ఉంది అంటూ తాజాగా సెన్సేషల్ కామెంట్స్ చేశాడు.కా
నీ విధి విచిత్రమైనదని.. ఇన్నాళ్లు కీరవాణి పడ్డ కష్టానికి ఆస్కార్ రూపంలో ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.చంద్రబోస్ రాసిన 5వేల పాటల్లో ఒదొక పాటనా? కీరవాణి ఇచ్చిన సంగీతంతో పోలిస్తే ఇదొక మ్యూజికేనా? అని ప్రశ్నించాడు. నాటు నాటు పాటలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ మాత్రం చాలా అద్భుతంగా ఉందని శివశక్తి దత్తా ప్రశంసించాడు. ఈ పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేశారని కొనియాడారు. రాజమౌళి కాన్సెప్ట్ అదుర్స్.. చంద్రబోస్, కీరవాణి కృషికి నాటు నాటు పాట రూపంలో ఫలితం దక్కిందని చెప్పుకొచ్చాడు.