గత కొన్ని రోజులుగా సింగర్ సునీత పై ఓ రూమర్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్‌పై తొలిసారి సింగర్ సునీత స్పందించారు.నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది. దీంతో చాలా రోజులుగా నడుస్తున్న రూమర్ కి బ్రేక్ పడినట్లైంది.
ఇక సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు సర్కారు నౌకరి అనే టైటిల్ ఖరారు అయ్యింది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌కే టెలీషో బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. సునీతకు 19 సంవత్సరాల వయసులో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఆకాష్, శ్రేయ. సునీత చాలా సంవత్సరాలకు రెండో వివాహం చేసుకున్నారు. మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనితో జనవరి 9, 2021 న వీరి పెళ్లి జరిగింది.