మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమా సీతారామం. ఈ సినిమాను ట్రైలర్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. దుల్కన్ స్మలాన్ సరసన మ్రుణాల్ ఠాగూర్ నటిస్తోంది. రష్మికా మందన్నా కీలక పాత్రలో వున్నారు. మద్రాస్ రెజిమెంటల్ లో లెఫ్టినెంట్ గా పనిచేసే రామ్…. రాసిన లేఖ ఆధారంగా సీత కోసం రష్మిక వెతుకుతున్న సన్నివేశాలు ఈ ట్రైలర్ లో కనిపిస్తాయి.
సీత కోసం రామ్… రామ్ కోసం సీత… వెతికే సన్నివేశాలు సూపర్ గా అనిపిస్తాయి. ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రను సుమంత్ నటించాడు. తరుణ్ భాస్కర్, ప్రకాశ్ రాజ్ ది కూడా కీలక పాత్రే. ఈ సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీ దత్, స్వప్నదత్ కలిసి నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర:శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 5 న ఈ సినిమా విడుదల అవుతుంది.