కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, మరో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ప్రధాని నరేంద్ర మోదీ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీకి మైనారిటీ సంక్షేమ శాఖను అదనంగా ఇచ్చారు. ఇక.. విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖను అదనంగా కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకు కేంద్ర మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేసేశారు. ఆయన్ను ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ వుందని తెలుస్తోంది. ఇక.. రాంచంద్ర ప్రసాద్ సింగ్ కూడా తన కేంద్ర మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు.