కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి తరలించారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆస్పత్రి చెస్ట్ మెడిసిన్ విభాగం డాక్టర్ అరూప్ బసు పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే వుందని ఆస్పత్రి తన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అయితే.. సోనియా గురువారమే ఆస్పత్రిలో చేరారు. ఆమెను నిరంతరం వైద్యుల పర్యవేక్షణలోనే వుంచామని పేర్కొన్నారు. జనవరిలో కూడా సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. జనవరి 5 న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గంగారాం ఆస్పత్రిలో చేరారు. అప్పుడు ఆమె వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ చేరారు.