Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియా… సోనియా వెంట రాహుల్, ప్రియాంక

వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాలకు వెళ్లనున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వెళ్లనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. అయితే.. ఏ తేదీల్లో వెళతారన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని రోజుల క్రిందటే అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిడ్ బారిన పడ్డారు.

 

కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆమె సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నారు. అయితే… పార్టీ అధ్యక్ష ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ.. అధ్యక్షురాలి విదేశీ పర్యటన శ్రేణులను ఇబ్బంది పెడుతోంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రాహుల్ ససేమిరా అంగీకరించడం లేదు. ఈ వ్యవహారం నానుతున్న సమయంలో సోనియా విదేశాలకు వెళ్తున్నారు.

Related Posts

Latest News Updates