శ్రీ బాలాజీ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను ఆగస్టు 5,6,7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కాంటన్‌లోని సౌత్ బోస్టన్‌లో ఉన్న శ్రీ సాయిచావడి మందిర్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీన గణేశ పూజ, పుణ్యావాచనం, కలశ పూజ, శ్రీ గణపతి హోమం, శ్రీసూక్త, పురుష సూక్త, శాంతిహోమం, వాస్తుపూజ, బింబశుద్ధ పూజతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 6వ తేదీన ద్వారపూజ, నవగ్రహ పూజ, మహాకుంభ ఉపకుంభ స్థాపన, పుష్పాధివాసం, సయ్యాదివాసం, నెట్రోమిలనం, యంత్రనవరత్న ప్రతిష్ఠ, బింబ స్థాపన వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆగస్టు 7వ తేదీన ప్రాణప్రాణప్రతిష్ఠాంగ హోమం, మహాకుంభ ప్రదక్షిణం, అష్టోత్తర కళశాభిషేకం, మహాకుంభాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.
