వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ న్యూడ్ వీడియోపై అనంతపురం ఎంపీ ఫకీరప్ప స్పందించారు. ఈ న్యూడ్ వీడియో ఒరిజినల్ వీడియో కాదని, మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే.. ఎక్కువ సార్లు షేర్ కావడం వల్ల నకిలీదా? అసలైందా? అన్నది తేల్చడం కష్టమని అన్నారు. వీడియోకు సంబంధించి బాధితులెవ్వరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోని మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని అన్నారు. వీడియోను మొత్తం ఐటీడీపీ అఫిషియల్ అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారని అన్నారు.
ఘాటుగా స్పందించిన టీడీపీ నేత లోకేశ్
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై అనంతపురం ఎంపీ ఫకీరప్ప చేసిన కామెంట్స్ పై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఏది ఫేకో? ఏది అసలైందో? ప్రజలే తేలుస్తారని అన్నారు. వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఏమైనా ఫోరెన్సిక్ నిపుణుడా? అంటూ నిలదీశారు. ఫేక్ అయితే… నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటి? అని సజ్జల ఎలా అంటారని లోకేశ్ ప్రశ్నించారు.