సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలూ సహకరించాలని లోకసభ స్పీకర్ ఓంబిర్లా కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఈ ప్రకటన చేశారు. ఆయన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేవాలు 18 రోజులు పనిచేస్తాయని, మొత్తం 108 గంటల పాటు సమావేశాలు జరుగుతాయని స్పీకర్ అఖిలపక్ష నేతలకు వివరించారు. ఇక రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా అఖిలపక్ష భేటీని నిర్వహించనున్నారు. సభ జరిగేందుకు అందరూ సహకరించాలని కోరనున్నారు.
Lok Sabha Speaker Om Birla chairs the meeting of leaders of all political parties, ahead of the commencement of #MonsoonSession of Parliament on 18th July. The Speaker will brief them on the preparations related to the Session. pic.twitter.com/ecD7DLYk76
— ANI (@ANI) July 16, 2022