విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి రోజువారీ ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా షిర్డీ సర్వీసు రాకపోకలు కొనసాగుతుందని ఇండిగో సంస్థ ప్రకటించింది. ATR 72-600 విమానం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుందని, 12:25 నుంచి బయల్దేరి, షిర్డీకి చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఇక… షిర్డీ నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు బయల్దేరి 4:26 గంటలకు విజయవాడ చేరుకుంటుందని ఇండిగో సంస్థ ప్రకటించింది. టిక్కెట్ ధర 4,639 గా వుంటుందని, అయితే.. డిమాండ్ ఆధారంగానే టిక్కెట్ ధర పెరుగుతుందని కూడా ప్రతినిధులు పేర్కొన్నారు. తొలిరోజు మాత్రం 70 మంది ప్రయాణికులు షిర్డీకి వెళ్లారని పేర్కొన్నారు. విజయవాడ టూ షిర్డీ.. చాలా లాంగ్ జర్నీ.. అయితే 20 గంటల పాటు ట్రైన్‌లో ప్రయాణించాలి. లేదా.. హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఇకపై ఇలాంటి ఇబ్బందికి ఇండిగో ఎయిర్‌లైన్స్ చెక్ పెట్టింది.