శ్రీలంకలో ఆర్థిక సంక్సోభం తీవ్రమైంది. దీంతో ప్రజల్లో ఆగ్రహం మళ్లీ కట్టలు తెంచుకుంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసాన్ని నిరసనకారులు మళ్లీ చుట్టుముట్టారు. దీంతో పరిస్థితిని గమనించి అధ్యక్షుడు గొటబయ ఇంటి నుంచి పరార్ అయ్యారు. ఈ విషయాన్ని శ్రీలంక సైన్యం ప్రకటించింది. అయితే ఆయన్ను ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి తరలించినట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే, ఇంటలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి తరలించినట్లు సైన్యం పేర్కొంది.
ప్రస్తుత వాతావరణానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జెండాలు, హెల్మెట్లు ధరించి.. నిరసనకు దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా.. ఆందోళన కారులు చెక్కు చెదరలేదు. బారికేడ్లను తోసుకుంటూ గొటబాయ నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణల్లో 30 మంది పౌరులు గాయపడ్డారు. వారిలో పోలీసులు కూడా వున్నారు.