ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 30 అంశాలతో వున్న ప్రతిపాదనలు పెట్టగా…. 30 ప్రతిపాదనలు ఈ సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాయని చైర్మన్ చక్రపాణి రెడ్డి ప్రకటించారు. 39 కోట్ల రూపాయలతో దేవస్థానం సిబ్బందికి వసతి కల్పించాలని నిర్ణయించుకున్నారు. అలాగే సిద్దరామప్ప కాంప్లెక్స్ పై అంతస్తులో వసతి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అలాగే ఆలయ పరిధిలోని ప్రధానమైన కూడళ్లల్లో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తామని ఈవో ప్రకటించారు.
ఇక… దేవస్థానం తరపున వున్న గంగా సదన్, గౌరీ సదన్, మల్లికార్జున సదన్ కు జనరేటర్ ఏర్పాట్లు చేయడం, భక్తుల కోసం నూతన డార్మిటరీని కట్టించనున్నారు. ఇక… క్షేత్ర పరిధిలో మంచినీళ్ల బాటిళ్ల స్థానే గాజు బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. ఇక… శ్రీశైల దేవస్థానంలోని ఉద్యోగులకు గతంలో 1200 ప్లాట్లు కేటాయించామని, ఇప్పుడు వాటికి రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని చైర్మన్ చక్రపాణి రెడ్డి ప్రకటించారు.