అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నక్షత్రశాంతి ఆగమోక్త ఆచారాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆగస్టు 10 నుంచి 14 వరకు దేవస్థానంలో 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్ర పఠనం, శాంతిమంత్ర జపాలు చేశారు. అమెరికాలో తొలి దేవాలయంగా పేరొందిన ఇక్కడ 47 ఏళ్లుగా ఉత్సవాలు, కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. గోమాతను పూజించారు. గోవింద నామస్మరణతో దేవస్థానం ప్రతిధ్వనించింది. దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గంగాధర్ నాగబండి, కార్యదర్శి చంద్రశేఖర్, ప్రెసిడెంట్ శర్వన్, కోశాధికారి రాజి శ్రీనివాసన్, కల్యాణ్ శీలంనేని, శ్రావణ్ చిన్నల, చంద్ర భోనగిరి తదితరులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
