ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం (మార్చి 23) ఈ సినిమా గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఎన్టీఆర్ 30 లాంచింగ్ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళితో పాటు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, ఏషియన్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, భరత్ చౌదరి, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రశాంత్ నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సందర్భంగా..
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌గారితో సెకండ్ టైమ్ సినిమా చేస్తున్నాను. జనతాగ్యారేజ్ తర్వాత ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఈ జెనరేషన్ బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్. నా బ్రదర్ ఆయన. సినిమా ఐడియా ఫార్ అక్రాస్ కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా, ఫర్‌గాటెన్ ల్యాండ్స్ లో సెట్ అయిన కథ ఇది.