కళా తపస్వీ కె. విశ్వనాథ్ (K Viswanath) గత రాత్రి 11 గంటలకు స్వర్గస్తులయ్యారు. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. విశ్వనాథ్ మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
‘ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే.. మాకు కె.విశ్వనాథ్ గారు ఉన్నారని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటి మర్చిపోలేదు. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు Q’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.