ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తారక్, చరణ్ కన్నా.. తానిప్పుడు నాటు నాటు స్టెప్పులను నాటుగా వేస్తున్నానని రాజమౌళి పేర్కొన్నాడు. అలాగే తన టీమ్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. తన పెద్దన్నయ్య కీరవాణి ఆస్కార్ నామినేషన్ పొందినందుకు తన ఆనందానికి అవధుల్లేవని హర్షం వ్యక్తం చేశారు. ఇంత కన్నా తనకేం వద్దని, మన పాట ఆస్కార్ స్టేజీ మీదకి వెళ్లినందుకు చంద్రబోస్ కి శుభాకాంక్షలు తెలిపాడు.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#NaatuNaatu #RRRMovie pic.twitter.com/Dvy2qK0qDB
— rajamouli ss (@ssrajamouli) January 24, 2023
ప్రేమ్ మాస్టర్ ఈ పాటకు అందించిన సహకారం వెలకట్టలేనిదని గుర్తు చేసుకున్నారు. భైరవ ఇచ్చిన బీజీఎమ్ స్ఫూర్తితోనే నాటు నాటు తీయాలని నిర్ణయించుకున్నానని, అందుకు భైరి బాబుకి ధన్యవాదాలు ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ఇక.. తారక్, చరణ్ లు వేసిన స్టెప్పులు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న అభిమానుల్లో చెరగని ముద్రలు వేశాయని జక్కన్న ట్వీట్ చేశారు. తాను కలలో కూడా ఆస్కార్ వరకూ వెళ్తానని అనుకోలేదని, కానీ అభిమానులు నమ్మారని ట్వీట్ చేశారు.