అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన విద్యార్థులు గల్లంతయ్యారు. 2 హెలికాప్టర్లతో తీరం వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. గోపాలపట్నం, తూచికొండ, యలమంచిలి ప్రాంతాలకు చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. ఇక… నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఇక… పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మరో విద్యార్థి ఆచూకీ కోసం నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్టు గార్డులు తీరంలో గాలిస్తున్నారు.
పూడిమడక బీచ్ కు అనకాపల్లి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు వెళ్లారు. 7 గురు విద్యార్థులు గల్లంతయ్యారు. అస్వస్థకు గురైన విద్యార్థిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మంది సురక్షితంగానే వున్నారు. మరో వైపు ఈ ఘటనపై సీఎం జగన్ ఆరాతీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి గుడివార అమర్నాథ్ ను ఆదేశించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.