తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్… ఏది చేసినా ప్రత్యేకమే. తన యాక్టింగ్.. తన మాట… తన వేషధారణ ఇలా…. ప్రతిదీ ప్రత్యేకమే. తాజాగా… తలైవా మరో రికార్డు కూడా నెలకొల్పారు. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదాయ పన్నుచెల్లింపుదారుగా రికార్డుల్లో కెక్కారు. ఈ సందర్భంగా తమిళనాడు ఆదాయ పన్ను శాఖ అధికారులు రజనీకాంత్ ను అవార్డుతో సత్కరించింది. ఈ నెల 24 న చెన్నైలో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇన్ కమ్ ట్యాక్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగానే ఐటీ అధికారులు ఈ అవార్డును అందించారు. అయితే.. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఈ అవార్డును అందుకుంది.
