Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..”నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎల్లప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. ఆ తరువాత ఎన్ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో మహేష్ బాబు, ఘట్టమనేని కుటుంభ సభ్యులు, తెలుగు సినీ, రాజకీయా ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణకు శ్రద్ధాంజలి ఘటించారు.

Related Posts

Latest News Updates